![]() |
![]() |

రీసెంట్ గా వచ్చిన మిరాయ్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా శ్రేయ, తేజ, జగపతి బాబు, హీరోయిన్ రితిక నాయక్. ప్రధాన పాత్రలు. ఇక వీళ్లంతా కపిల్ శర్మ షోలో మెరిశారు. ఇక కపిల్ శర్మ తేజ చెప్పిన డైలాగ్స్ ని హిందీలో చెప్పి నవ్వించాడు. ఇక శ్రియ తనకు కాఫీ ఇష్టం అని చెప్పేసరికి రష్యన్ అమ్మాయి ఒక్సానానా పిలిచి మీ వదిన వచ్చింది అంటూ కాసేపు హిందీలో, రష్యన్ లో మాట్లాడించాడు. ఇక ఈ షోకి పెర్మనెంట్ గెస్ట్ గా ఉన్న అర్చన పూరన్ సింగ్ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. "జెబి సర్ మీకు గనక సూపర్ పవర్స్ ఉంటే ఎవరి మైండ్ ని చదవాలనుకుంటారు" అని అడిగారు.
"దేవుడి మైండ్ చదవాలనుకుంటాను..ఫ్యూచర్ లో ఎం జరుగుతుందో ముందు తెలుసుకుంటాను " అంటూ జగపతి బాబు ఆన్సర్ ఇచ్చారు. ఇక కపిల్ శర్మ ఐతే "నాకే సూపర్ పవర్స్ ఉంటే వీసా లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్ కి ఎగిరి వెళ్ళిపోతా" అని చెప్పాడు. "తేజ టెలిపోర్ట్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తావ్" అని అడిగారు అర్చన. "టెలిపోర్ట్ ద్వారా మహాభారతం జరిగిన ప్లేస్ కి వెళ్లి చూడాలనుకుంటాను" అని చెప్పాడు. "జెబి సర్ మీ వాయిస్ ఇలా ఉండడానికి ఏదైనా రిహార్సల్స్ చేస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, నేచురల్ గానే ఉంటుందా" అని అడిగాడు కపిల్ శర్మ. "నా వాయిస్ నాకంటే ముందే పుట్టింది..ఇంతకు ముందు నేను చేసిన మూవీస్ కి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా వాయిస్ మెచూర్డ్ గా ఉంది కాబట్టి నేనే చెప్పుకుంటా" అన్నారు జగపతి బాబు.
![]() |
![]() |